దుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ ఎన్వీ Ramana

ABN , First Publish Date - 2021-12-25T15:20:38+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ ఎన్వీ Ramana

విజయవాడ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మేళతాళాలతో మంగళవాయిద్యాల నడుమ ఎన్వీ రమణకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ అమ్మవారి లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని సీజేఐ‌కు అందజేశారు. ఆలయ అధికారులతో పాటు  ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని, కలెక్టర్ నివాస్, దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్, వాణీమోహన్... ఎన్వీ రమణకు స్వాగతం పలికారు. 

Updated Date - 2021-12-25T15:20:38+05:30 IST