నేడు విజయవాడలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన

ABN , First Publish Date - 2021-12-26T14:02:11+05:30 IST

మూడోరోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడ కానూరులో సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో జస్టిస్‌ లావు..

నేడు విజయవాడలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటన

అమరావతి: సీజేఐ ఎన్వీ రమణ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. మూడోరోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడ కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాసంలో సీజేఐ ప్రసంగిస్తారు. అలాగే ఉదయం 11 గంటలకు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే జ్యుడీషియల్‌ ఆఫీసర్ల కాన్ఫరెన్సులో సీజేఐ పాల్గొంటారు‌. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 460 మంది న్యాయాధికారులు హాజరవుతారు. మధ్యాహ్నం 12.30కు హైకోర్టు ఆవరణలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, స్టేట్‌ బార్‌ కౌన్సిళ్ల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ఇచ్చే తేనీటి విందుకు హాజరవుతారు. అనంతరం గుంటుపల్లిలో బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అక్కడి నుంచి కంచికచర్ల చేరుకుని రాత్రికి హైదరాబాద్‌కు తిరుగు పయనంతో ఏపీలో నేటితో సీజేఐ ఎన్వీ రమణ ముగియనుంది. 

Updated Date - 2021-12-26T14:02:11+05:30 IST