దురుద్దేశంతోనే కేసులు: పౌరహక్కుల నేతలు
ABN , First Publish Date - 2021-01-20T09:09:41+05:30 IST
గత నవంబరు 23న విశాఖ జిల్లా ముంచంగిపుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాదులు, పౌరహక్కుల సంఘం

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): గత నవంబరు 23న విశాఖ జిల్లా ముంచంగిపుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ న్యాయవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు ఐదుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి సి.చంద్రశేఖర్, ఖైదీల హక్కుల పోరాట ఉద్యమకారుడు వీవీ బాలకృష్ణ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ సంఘం నేత కె.సింహాచలం, అణగారిన వర్గాల హక్కుల ఉద్యమకారిణి కె.పద్మ ఉన్నారు.