స్టీల్‌ ప్లాంట్‌ మూతపడదు

ABN , First Publish Date - 2021-10-07T09:30:29+05:30 IST

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మారుతుందే తప్ప మూతబడదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ మూతపడదు

యాజమాన్యం మారుతుంది: పురందేశ్వరి 

చిత్తూరు(సెంట్రల్‌), అక్టోబరు 6: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం మారుతుందే తప్ప మూతబడదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. బుధవారం చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయం ముందు బీజేపీ మహాధర్నాలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చిత్తూరు జిల్లాలోని విజయ డెయిరీతో పాటు మూతబడ్డ షుగర్‌ ఫ్యాక్టరీలను తెరుస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌ ఎందుకు మాట తప్పారు?ఎందుకు మడమ తిప్పారని ప్రశ్నించారు. 27 చక్కెర ఫ్యాక్టరీలున్న రాష్ట్రంలో కేవలం ఐదునుంచి ఆరు మాత్రమే మిగిలి ఉండడం బాధాకరమన్నారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా అమూల్‌ పాల సేకరణ చేస్తున్నా, పుంగనూరులో ఎవరి ప్రయోజనం కోసం పాల సేకరణ చేయలేదని ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-07T09:30:29+05:30 IST