Chittoor: పెరిగిన టమోటా ధరలు
ABN , First Publish Date - 2021-10-25T12:35:50+05:30 IST
మదనపల్లె మార్కెట్‌యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి

చిత్తూరు: మదనపల్లె మార్కెట్‌యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. మదనపల్లె మార్కెట్‌కు నిత్యం 300 నుంచి 400 టన్నుల టమోటా విక్రయానికి వస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఊజీగ, మచ్చలతో అంతంత మాత్రమే నాణ్యత ఉండటంతో టమోటా ధరలు కిలో గరిష్ఠంగా రూ.30 నుంచి కనిష్ఠంగా రూ.7 పలికాయి. కాగా ఆదివారం మార్కెట్‌కు 362 టన్నులు విక్రయానికి రాగా, కాయలు నాణ్యంగా ఉండడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. దీంతో మొదటిరకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.52 పలుకగా, రెండో రకం టమోటా కనిష్ఠంగా రూ.12 పలికింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.