మద్యం మత్తులో యువకుడు వీరంగం

ABN , First Publish Date - 2021-02-06T20:04:29+05:30 IST

ల్లాలోని కుప్పం పోలిస్టేషన్ ముందు ఓ యువకుడు హల్‎చల్ చేశాడు. తప్పతాగిన యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు...

మద్యం మత్తులో యువకుడు వీరంగం

చిత్తూరు: జిల్లాలోని కుప్పం పోలీస్ స్టేషన్ ముందు ఓ యువకుడు హల్‎చల్ చేశాడు. తప్పతాగిన యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని నానా హంగామా చేశాడు. మద్యం ధరలు తగ్గించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు.మద్యం షాపులలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ..మద్యం అమ్ముతున్న వారిని నిలదీస్తే వారు తనపై దాడి చేశారంటూ పోలీసులతో యువకుడు వాగ్వాదానానికి దిగాడు. దీంతో రోడ్డుపైన చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో..పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-02-06T20:04:29+05:30 IST