మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు
ABN , First Publish Date - 2021-07-03T09:02:59+05:30 IST
కొవిడ్‌పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారన్న అభియోగంపై విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన కెమికల్ ఇంజనీర్
కొవిడ్‌పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారని అభియోగం
గాజువాక (విశాఖపట్నం), జూలై 2: కొవిడ్‌పై ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారన్న అభియోగంపై విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీచేశారు. ఈనెల 5న హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గత నెల 7న ఓ టీవీ చానల్‌లో చర్చ సందర్భంగా మల్లిక్ కొవిడ్‌పై ప్రజల్లో భయం కలిగించేలా అభ్యంతరకర పదజాలం వాడారని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గత నెల 14న సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను అడ్మిన్‌గా నిర్వహిస్తున్న కొవీకేర్ వాట్సాప్ గ్రూపును గురువారం నుంచి అర్ధంతరంగా నిలిపివేశారని మల్లిక్ ఆరోపించారు. దీనికి నిరసనగా శుక్రవారం ఆలూరి టవర్స్‌లో రిలే దీక్ష నిర్వహిచారు.