జగన్‌రెడ్డి సొంత ఇలాకాలోనే బీసీలకు భద్రత కరువు: చంద్రశేఖర్ యాదవ్

ABN , First Publish Date - 2021-08-11T02:50:02+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి సొంత ఇలాకాలోనే బీసీలకు భద్రత కరువైందని తెలుగుదేశం ఏపీ బీసీ సెల్ కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు.

జగన్‌రెడ్డి సొంత ఇలాకాలోనే బీసీలకు భద్రత కరువు: చంద్రశేఖర్ యాదవ్

కడప: సీఎం జగన్‌రెడ్డి సొంత ఇలాకాలోనే బీసీలకు భద్రత కరువైందని తెలుగుదేశం ఏపీ బీసీ సెల్ కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అలీషా ఆత్మహత్య ఘటన మరువకముందే పులివెందులలో బీసీ సామాజికవర్గానికి చెందిన అశోక్ లాకప్ డెత్ జరిగిందన్నారు. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య , హజీరా అత్యాచారం, హత్య.. నేడు అలీషాను పోలీసులు కొట్టి చంపటం, అశోక్ లాకప్ డెత్ ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. వివేక హత్య కేసులో బీసీ యువకుడు సునీల్‌ని వేధిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌రెడ్డి బీసీలను ఉద్దరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు బీసీలకు కనీస రక్షణ లేకుండా చేశారని చంద్రశేఖర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-11T02:50:02+05:30 IST