ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు

ABN , First Publish Date - 2021-11-02T07:59:21+05:30 IST

ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

ప్రభుత్వ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు

అమరావతి/విజయవాడ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఏపీఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీఎన్జీవో అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం-ఉద్యోగుల మధ్య వారధిగా ఆయన పనిచేయాలని ఏపీ ఏపీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి సూచించారు. చంద్రశేఖరరెడ్డి నియామకం పట్ల ఏపీపీటీడీ ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై. శ్రీనివాసరావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఓబులేసు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-02T07:59:21+05:30 IST