చంద్రబాబు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు

ABN , First Publish Date - 2021-10-29T09:51:28+05:30 IST

చంద్రబాబు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు

చంద్రబాబు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారు

పట్టాభిని పోక్సో కింద విచారించాలి: ఎంపీ మాధవ్‌


న్యూఢిల్లీ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఫిర్యాదు చేశారు. గురువారం ఢిల్లీలో అమిత్‌ షా అధ్యక్షతన హోం శాఖ కన్సల్టెటివ్‌ కమిటీ  సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న మాధవ్‌... సమావేశం ముగిసిన తర్వాత బయటికి వస్తున్న సమయంలో హోంమంత్రికి లేఖ అందించారు. చంద్రబాబు. బూతులతో దూషిస్తు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. దుర్భాషలాడడంపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను బలోపేతం చేయాలన్నారు. టీడీపీ నేత పట్టాభిపై పోక్సో చట్టం కింద విచారణ జరపాలని ఎంపీ కోరారు. 

Updated Date - 2021-10-29T09:51:28+05:30 IST