ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2021-10-20T19:19:05+05:30 IST

ధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పేదరికంతో బాధపడుతున్న వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ

అమరావతి: ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పేదరికంతో బాధపడుతున్న వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారు. వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడమే వాల్మీకి, బోయల జీవనోపాధి అని పేర్కొన్నారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కూడా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పిందన్నారు. వాల్మీకి, బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని పలు నివేదికలు కూడా సిఫారసు చేశాయని లేఖలో పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చారని చెప్పారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సానుకూల స్పందన ఆశిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-10-20T19:19:05+05:30 IST