చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లకు చంద్రబాబు అభినందనలు

ABN , First Publish Date - 2021-01-12T15:43:22+05:30 IST

అమరావతి: చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.

చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లకు చంద్రబాబు అభినందనలు

అమరావతి: చరిత్ర సృష్టించిన భారత మహిళా పైలెట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌లో కెప్టెన్ జోయ అగర్వాల్ బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ఉత్తర ధ్రువం మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బోయింగ్ 777 నడపడం భారత వైమానిక రంగానికే ఒక చరిత్రగా ఆయన అభివర్ణించారు. 16గంటల్లో ఎక్కడా ఆగకుండా 13,993కి.మీ. మేర విమానం నడిపి చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచ చరిత్రలోనే వాణిజ్య విమానం సుదీర్ఘ దూరం నడిపిన ఘనత మన మహిళా పైలెట్లదేనన్నారు. మహిళా పైలెట్లు జోయా అగర్వాల్, తన్మయి, సోనావారే, శివానిలకు అభినందనలు తెలిపారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్విస్తున్నామని చంద్రబాబు ప్రశంసించారు.


Updated Date - 2021-01-12T15:43:22+05:30 IST