క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-12-25T14:00:12+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమనులందరికీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సోదర, సోదరీమనులందరికీ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్రీస్తు జన్మదినం శాంతి, సంతోషాలకు చిహ్నం. యేసు దీవెనలు ప్రతి ఇంటిల్లిపాదికీ అందాలి. కరుణామయుని మార్గం ప్రజలకు స్ఫూర్తి దాయకం. ప్రజల జీవితాల్లో నెలకొన్న బాధలు తొలగించి, సకల సంతోషాలతో విరాజింపజేయాలని జీసస్‌ను వేడుకుంటున్నా.ఏసు ప్రభువు చూపించిన సేవామార్గంలో ప్రతిఒక్కరూ నడవాలి.కోవిడ్ నిబంధనలు పాటించి ఆనందోత్సవాలతో పండుగ నిర్వహించుకోవాలి’’ అని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2021-12-25T14:00:12+05:30 IST