కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-09T01:10:59+05:30 IST

కుప్పం రివ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవ‌ర్టులు త‌యార‌య్యారని ఆరోపించారు.

కుప్పం రివ్యూలో చంద్రబాబు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

అమరావతి: కుప్పం రివ్యూలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవ‌ర్టులు త‌యార‌య్యారని ఆరోపించారు. పార్టీలోని కోవ‌ర్టుల‌ను ఏరిపారేస్తామని, కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళ‌న ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ‘‘న‌న్ను మెప్పించ‌డం కాదు. ప్రజ‌ల్లో ప‌నిచేసిన వారికే గుర్తింపు ఉంటుంది. స్థానిక నేత‌ల అతివిశ్వాసం వ‌ల్లనే కుప్పంలో ఓడిపోయాం’’ అని చంద్రబాబు తెలిపారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మికి గత కార‌ణాలను కుప్పం నేత‌లు వివ‌రించారు. వైసీపీ అరాచకాలు, సొంత పార్టీలో త‌ప్పిదాల‌ను అధినేత‌కు కార్యక‌ర్తలు తెలిపారు. కుప్పం స్థానిక నాయ‌క‌త్వంలో మార్పులు చేయాలన్న.. కార్యక‌ర్తల సూచ‌న‌లు అమ‌ల్లోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక‌పై త‌రుచూ కుప్పంలో ప‌ర్యటిస్తానని తెలిపారు. కార్యక‌ర్తలు, నేత‌లకు ఎక్కవ స‌మ‌యం కేటాయిస్తానని పేర్కొన్నారు. కుప్పంలో సొంత ఇళ్లు నిర్మిస్తామని, ఎక్కువ సమయం కేటాయిస్తానని చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-12-09T01:10:59+05:30 IST