యనమల సుధాకర్‌కు చంద్రబాబు ఫోన్

ABN , First Publish Date - 2021-02-07T00:02:09+05:30 IST

బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పంచాయతీ స్థానానికి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న యనమల సుధాకర్‌కు టీడీపీ అధినేత

యనమల సుధాకర్‌కు చంద్రబాబు ఫోన్

అమరావతి: బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల పంచాయతీ స్థానానికి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న యనమల సుధాకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని, ఎవరికీ భయపడవద్దని చంద్రబాబు ధైర్యం చెప్పారు. సుధాకర్‌పై అతని బంధువు రజనీప్రసాద్‌ సీఐ మోహన్‌రెడ్డికి ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు సుధాకర్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపారు. అయితే వత్తిడికి గురైన సుధాకర్‌ అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. పోరుమామిళ్ల సర్పంచ్‌ అభ్యర్థి యనమల సుధాకర్‌ గెలుస్తారనే ఉద్దేశ్యంతో ఆయనపై వైసీపీ వారు అక్రమ కేసు బనాయించాలని చూశారని, దీంతో వత్తిడికి లోనై ఆసుపత్రిపాలయ్యారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-02-07T00:02:09+05:30 IST