ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు తెలియడం లేదు: బొత్స

ABN , First Publish Date - 2021-01-14T00:44:29+05:30 IST

ప్రజలు ఎందుకు ఓడించారో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

ప్రజలు ఎందుకు ఓడించారో చంద్రబాబుకు తెలియడం లేదు: బొత్స

విజయనగరం: ప్రజలు ఎందుకు ఓడించారో టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి, పోలవరాన్ని ఏటీఎం కార్డులుగా వాడుకున్నారని తప్పుబట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తే ఎందుకు అంత ఆక్రోశమని ప్రశ్నించారు. పారదర్శకత కోసమే నూతన మున్సిపల్ ట్యాక్స్ విధానాన్ని తీసుకువస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబు మాన్సాస్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని, మాన్సాస్ ట్రస్ట్‌ను ప్రభుత్వంలో కలపాలని, మాజీమంత్రి అశోక్‌గజపతి 2004 ముందు ప్రభుత్వానికి లేఖ రాశారని బొత్స గుర్తుచేశారు. ఆనందగజపతి చైర్మన్‌గా ఉండడం ఇష్టంలేక అశోక్‌ లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వంలో కలపవద్దన్న ఆనంద గజపతి విజ్ఞప్తితోనే.. ట్రస్ట్‌కు ఆనందగజపతిని చైర్మన్‌గా కొనసాగించామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-14T00:44:29+05:30 IST