నేటి మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్న చంద్రబాబు
ABN , First Publish Date - 2021-10-25T14:43:00+05:30 IST
నేటి మధ్యాహ్నం 12.30కి టీడీపీ అధినేత చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరనుంది.

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. నేటి మధ్యాహ్నం 12.30కి చంద్రబాబు బృందం రాష్ట్రపతిని కలవనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ బృందం కోరనుంది. రాష్ట్రపతికి రాష్ట్రంలో పరిస్థితిని చంద్రబాబు వివరించనున్నారు. టీడీపీ కార్యాలయ విధ్వంస ఘటనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్రపతికి సమగ్ర నివేదిక అందించారు. ప్రధాని, హోంమంత్రి అపాయింట్మెంట్ టీడీపీ నేతలు కోరారు. మరికొందరు కేంద్రమంత్రుల్ని కూడా కలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.