ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-20T01:38:39+05:30 IST

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడిని ఆయన తీవ్రంగా...

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: చంద్రబాబు

అమరావతి: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చారు. 


కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. కార్యాలయాల్లోకి చొరబడి ఇష్టమొచ్చినట్లు బీభత్సం సృష్టించారు. అంతేకాదు పలువురిపైనా దాడి చేశారు. టీడీపీ నేతలకు సంబంధించిన వాహనాలను కూడా వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. టీడీపీ నేత పట్టాభి నివాసంలోనూ అరాచకం సృష్టించారు. విలువైన సామాన్లతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. Updated Date - 2021-10-20T01:38:39+05:30 IST