దర్శకుడు విశ్వేశ్వరరావు మృతికి చంద్రబాబు సంతాపం

ABN , First Publish Date - 2021-05-21T04:40:41+05:30 IST

ప్రముఖ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు..

దర్శకుడు విశ్వేశ్వరరావు మృతికి చంద్రబాబు సంతాపం

అమరావతి: ప్రముఖ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు భాష అభిమానిగా, తెలుగు భాష బలోపేతం కోసం విశ్వేశ్వరరావు విశేషమైన కృషిచేశారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారని చంద్రబాబు అన్నారు. విశ్వేశ్వరరావు మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2021-05-21T04:40:41+05:30 IST