ఏపీలో వెంటనే లాక్‌డౌన్ విధించాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-05-06T00:16:49+05:30 IST
ఏపీలో వెంటనే లాక్‌డౌన్ విధించాలి: చంద్రబాబు

అమరావతి/హైదరాబాద్: ఏపీలో వెంటనే లాక్‌డౌన్ విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జూమ్ ద్వారా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్లు అందచేయాలన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. మీడియా ప్రతినిధులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా పరిగణించాలని కోరారు. కర్ఫ్యూ పెట్టి నిత్యవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉ.6 గంటలకే మద్యం దుకాణాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. దేశమంతా లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.