చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారు: ధర్మాన

ABN , First Publish Date - 2021-10-21T21:40:04+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గురువారం ఆయన

చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారు: ధర్మాన

శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష దేనికి చేస్తున్నారని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్‌పై వాడిన భాషను చంద్రబాబు సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయి టీడీపీ తీవ్ర అసహనానికి గురవుతోందని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణానికి టీడీపీయే కారణమని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.

Updated Date - 2021-10-21T21:40:04+05:30 IST