పేదలంటే చంద్రబాబుకు అక్కసు: బొత్స

ABN , First Publish Date - 2021-12-08T22:51:47+05:30 IST

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నెగెటివ్‌ కోణంలో చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు.

పేదలంటే చంద్రబాబుకు అక్కసు: బొత్స

అమరావతి: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నెగెటివ్‌ కోణంలో చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లడం, పథకాలు ఆపుతున్నారని ఆరోపించారు. పేదలంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్కసన్నారు. నిబంధనలకు లోబడి అప్పులు చేసినా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎఫ్‌ఆర్‌బీఎంకి లోబడే అప్పులు తెస్తున్నామని బొత్స నారాయణ తెలిపారు.


Updated Date - 2021-12-08T22:51:47+05:30 IST