చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన నిర్ణయం తీసుకుంటారు: ఎస్పీ డా. ఫక్కీరప్ప
ABN , First Publish Date - 2021-05-08T19:58:13+05:30 IST
ఎన్ 440కే వైరస్‌పై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశామని ఎస్పీ డా.ఫక్కీరప్ప తెలిపారు.

కర్నూలు: ఎన్ 440కే వైరస్‌పై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశామని ఎస్పీ డా.ఫక్కీరప్ప తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుకు నోటీసులు ఇస్తామని చెప్పారు. రేపు చంద్రబాబుకు నోటీస్ ఇచ్చి 7 రోజుల్లోపు హాజరు కావాలని కోరుతామన్నారు. శాస్త్రీయంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఎస్పీ డా.ఫక్కీరప్ప పేర్కొన్నారు.