ప్రత్యేక హోదా సాధన కోసం.. ప్రధాని ఇంటి ముందు ఎంపీలు ధర్నా చేయాలి: చలసాని

ABN , First Publish Date - 2021-06-22T08:37:13+05:30 IST

రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌

ప్రత్యేక హోదా సాధన కోసం.. ప్రధాని ఇంటి ముందు ఎంపీలు ధర్నా చేయాలి: చలసాని

సిరిపురం (విశాఖపట్నం), జూన్‌ 21: రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం రాష్ట్రానికి చెందిన ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపీలు రాజీనామా చేయాలనే డిమాండ్‌ వల్ల ప్రయోజనం ఉండదన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా కలిసి పార్లమెంట్‌ ముందు, లేదంటే ప్రధాని ఇంటి ముందు ధర్నాలు చేయాలన్నారు. ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తే అరెస్టు చేస్తారనే భయం వద్దని, ఎన్నిసార్లు అరెస్టు చేసినా వెనక్కి తగ్గొద్దన్నారు. ఈ తరహా ఆందోళనలతో మాత్రమే రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర వనరులకు గుజరాతీలకు అడ్డంగా అమ్ముతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. దేశంలో కేంద్రం ఏర్పాటు చేయతలపెట్టిన 100 ఆక్సిజన్‌ ప్లాంట్లలో ఒక్కదాన్ని కూడా తెలుగు రాష్ర్టాలకు కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. ఏపీ మణిహారం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందన్నారు.

Updated Date - 2021-06-22T08:37:13+05:30 IST