యువతకు ద్రోహం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-28T08:30:57+05:30 IST

అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం పోటీ పడి నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు.

యువతకు ద్రోహం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు: తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 27: అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం పోటీ పడి నిరుద్యోగ యువతకు ద్రోహం చేస్తున్నాయని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి ఆరోపించారు. సోమవారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఖాళీగా ఉండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కూడా యువతకు ద్రోహం చేస్తోందన్నారు.  దాదాపు 2.50 లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా గడచిన రెండున్నరేళ్లలో కంటి తుడుపు చర్యగా కేవలం 11,359 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందన్నారు. 

Updated Date - 2021-12-28T08:30:57+05:30 IST