డిస్కమ్‌లకు కేంద్రం షాక్‌!

ABN , First Publish Date - 2021-08-20T07:46:47+05:30 IST

విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఏడు నెలల్లోపు బకాయిలు (లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ కలుపుకొని) చెల్లించకపోతే ఆయా సంస్థలు ఎవరికైనా విద్యుత్‌ను అమ్ముకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

డిస్కమ్‌లకు కేంద్రం షాక్‌!

ఏడు నెలల్లోపు బకాయిలు చెల్లించకపోతే విద్యుదుత్పత్తి సంస్థలు ఎవరికైనా కరెంట్‌ అమ్ముకునే చాన్స్‌

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఏడు నెలల్లోపు బకాయిలు (లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ కలుపుకొని) చెల్లించకపోతే ఆయా సంస్థలు ఎవరికైనా విద్యుత్‌ను అమ్ముకోవడానికి వెసులుబాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్‌ సవరణ నిబంధనలు (లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీ)-2021 ముసాయిదాను కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసింది. దీనిపై నెలరోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలని రాష్ట్రాలను, డిస్కమ్‌ల సీఎండీలను కోరింది. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. 

Updated Date - 2021-08-20T07:46:47+05:30 IST