సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
ABN , First Publish Date - 2021-01-20T23:41:21+05:30 IST
సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

హైదరాబాద్: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్షీట్లో అభియోగాలపై కోర్టు విచారించింది. అయితే నిందితులు వాదనలకు సమయం కోరారు. తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. వాదనలు వినిపించకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 25కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.