జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడే తీర్పు
ABN , First Publish Date - 2021-08-25T08:52:11+05:30 IST
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుం ది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

పిటిషన్‌పై జూలై చివర్లో ముగిసిన వాదనలు
తీర్పు రిజర్వు చేసిన సీబీఐ కోర్టు
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుం ది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసి న ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. సీఎంగా తనకుండే అధికారాలతో.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను విచారించాలని కోరారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం విచారణ కొనసాగనుంది.