న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐ చార్జీషీట్‌

ABN , First Publish Date - 2021-09-03T02:04:27+05:30 IST

ఏపీలో జడ్జిలు, కోర్టులపై సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరు సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు చార్జీషీట్‌ దాఖలు చేశారు.

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐ చార్జీషీట్‌

గుంటూరు: ఏపీలో జడ్జిలు, కోర్టులపై సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరు సీబీఐ కోర్టులో సీబీఐ అధికారులు చార్జీషీట్‌ దాఖలు చేశారు. గతేడాది నవంబర్‌ 11వ తేదీన 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. లింగారెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై సీబీఐ చార్జీషీట్‌ దాఖలు చేసింది. రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో సీబీఐ దాడులు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోషల్‌మీడియాలో జడ్జిలపై పెట్టిన అనుచిత పోస్టులను తొలగించామని సీబీఐ పేర్కొంది.

Updated Date - 2021-09-03T02:04:27+05:30 IST