పార్టీ పదవికి పిల్లి అనంతలక్ష్మి రాజీనామా
ABN , First Publish Date - 2021-02-06T09:11:09+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు తమ పదవులకు రాజీనామా చేశారు.

సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 5: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు తమ పదవులకు రాజీనామా చేశారు. శుక్రవారం కాకినాడలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితులు, వైసీపీ బెదిరింపులు, బలవంతంగా సర్పంచ్ ఏకగ్రీవాలు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.