బెడ్ దొరక్క.. ఆస్పత్రి ఆవరణలోనే ఆగిన ఊపిరి
ABN , First Publish Date - 2021-05-08T09:16:13+05:30 IST
ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో ఓ వృద్ధుడి ఊపిరి ఆగిపోయింది. శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ విషాదకర సంఘటన జరిగింది

బెడ్ ఏది సారూ...
చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రిలో బెడ్ లభించక పోవడంతో ఆవరణలోనే ఓ వృద్ధుడి ఊపిరి ఆగిపోయింది.మృతదేహం పక్కనే విలపిస్తున్న ఆయన భార్య
మదనపల్లె క్రైం, మే 7: ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో ఓ వృద్ధుడి ఊపిరి ఆగిపోయింది. శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ విషాదకర సంఘటన జరిగింది. కొండయ్యగారిపల్లెకు చెందిన రామచంద్ర (65) కరోనా బారినపడి ఇంటివద్ద కోలుకుంటున్నాడు. దగ్గు, ఆయాసం ఎక్కువై ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో కుటుంబీకులు మదనపల్లెలోని కొవిడ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బెడ్ ఖాళీగా లేదని వైద్యులు చెప్పారు. వేరే ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా, ఊపిరి ఆడక మృతి చెందాడు.