పథకాలపై ప్రచారం చేయండి

ABN , First Publish Date - 2021-08-21T09:06:29+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, ప్రభుత్వం

పథకాలపై ప్రచారం చేయండి

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై పట్టణాల్లోని వార్డుల్లో ప్రచారం చేసేందుకు సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ క్యాంపైన్‌ను చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్‌ షన్‌మోహన్‌ సగిలి ఆదేశాలిచ్చారు. ఆయా వార్డులను సిబ్బంది సందర్శించి ప్రభుత్వ పథకాల గురించి, మీ సేవ, నాన్‌ మీ సేవల మధ్య తేడాల గురించి వివరించాలన్నారు. ప్రతినెలా ఆఖరి శుక్రవారం, శనివారాల్లో ఈ ప్రచారం నిర్వహించాలని సూచించారు. 


Updated Date - 2021-08-21T09:06:29+05:30 IST