15,000 ఇంజెక్షన్లు కొనుగోలు

ABN , First Publish Date - 2021-05-20T09:35:12+05:30 IST

రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల నివారణకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. చికిత్స

15,000 ఇంజెక్షన్లు కొనుగోలు

బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు ప్రభుత్వం చర్యలు

ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌


అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల నివారణకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిందని వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. చికిత్స అందించేందుకు అవసరమైన ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం కేటాయించిన 1,650 వయల్స్‌కు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చామని, సొంతంగా 15,000 వయల్స్‌ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కేంద్రం కేటాయించిన వయల్స్‌ ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రానికి సరఫరా అవుతాయని, బ్లాక్‌ ఫంగస్‌ సోకిన పేషెంట్‌కు 3 లక్షల వరకూ వ్యయమవుతుంది కాబట్టి ఆ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని పేర్కొన్నారు. ఏపీకి ఇచ్చే ఆక్సిజన్‌ కోటాను కేంద్రం 625 టన్నులకు పెంచిందని వెల్లడించారు.


ఈ నెల 23లోగా 4 ట్యాంకర్లు ఇస్తారని, వాటి ద్వారా 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని ఆయన తెలిపారు. జామ్‌నగర్‌ నుంచి 80 మెట్రిక్‌ టన్నుల ఆ క్సిజన్‌ బుధవారం రాత్రికి గుంటూరు చేరుకుంటుందన్నారు. గడచిన 24 గంటల్లో 120 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కృష్ణపట్నం పోర్టుకు వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ పడకలు 735, ఆక్సిజన్‌ పడకలు 1,075, సాధారణ పడకలు 9,378 ఖాళీగా ఉన్నాయని తెలిపారు.  

Updated Date - 2021-05-20T09:35:12+05:30 IST