తెలుగురాష్ర్టాల్లో ‘వ్యాపార’ సంస్కరణలు విజయవంతం

ABN , First Publish Date - 2021-02-18T08:51:55+05:30 IST

కేంద్ర ప్రభుత్వం చే పట్టిన ఈజ్‌ ఆ్‌ఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స(సులభతర వ్యాపారం) సంస్కరణల అమలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చే సిన 15 రాష్ర్టాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నట్టు కేంద్ర ఆర్థికశా ఖ వెల్లడించింది.

తెలుగురాష్ర్టాల్లో ‘వ్యాపార’ సంస్కరణలు విజయవంతం

15 రాష్ర్టాల్లో సులభతర వ్యాపార సంస్కరణలు పూర్తి

9,905 కోట్ల అదనపు రుణాలకు అనుమతి: ఆర్థికశాఖ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం చే పట్టిన ఈజ్‌ ఆ్‌ఫ్‌ డూయింగ్‌ బిజినె్‌స(సులభతర వ్యాపారం) సంస్కరణల అమలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చే సిన 15 రాష్ర్టాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నట్టు కేంద్ర ఆర్థికశా ఖ వెల్లడించింది. తొలిదశలో 12 రాష్ర్టాలు(ఏపీ, తె లంగాణ, అసోం, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు) ఈ సంస్కరణలను పూర్తి చే యగా, ఇప్పుడు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ కొత్తగా ఈ జాబితాలో చేరాయి. ఈ సంస్కరణలు పూర్తిస్థాయిలో అమలు చేసినందుకు  ఆ 15 రాష్ర్టాలకు బహిరంగ మార్కెట్‌ నుంచి అదనంగా రూ. 9,905 కోట్ల రుణాల సేకరణకు కేంద్రం అనుమతించింది. ఇందులో ఏపీకి ఇంతవరకు రూ.2,525 కోట్లు, తెలంగాణకు రూ.2,508 కోట్లు వంతున అదనపు రుణాల సేకరణకు అనుమతించినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.

Updated Date - 2021-02-18T08:51:55+05:30 IST