పర్యాటక కేంద్రంగా చంద్రవరం: బౌద్దభిక్షువు బోరీ

ABN , First Publish Date - 2021-03-14T09:48:46+05:30 IST

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం ప్రాంతంలో బుద్దిజం స్టడీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషిచేయనున్నట్టు శ్రీలంక నుంచి వచ్చిన

పర్యాటక కేంద్రంగా చంద్రవరం: బౌద్దభిక్షువు బోరీ

దొనకొండ, మార్చి 13: ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం ప్రాంతంలో బుద్దిజం స్టడీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషిచేయనున్నట్టు శ్రీలంక నుంచి వచ్చిన బౌద్దభిక్షువు బోరీహీన్‌ తెలిపారు. చందవరం గ్రామానికి ఎంతో చరిత్ర ఉందని ఆయన అన్నారు.  గ్రామసమీపంలోని బౌద్దక్షేత్రాన్ని శనివారం సందర్శించిన ఆయన దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్న కొండను ఎక్కి బౌద్దక్షేత్రం వద్ద మోకరిల్లి కొంతసేపు ధ్యానం చేశారు.  ఈ సందర్భంగా  మాట్లాడుతూ శివగంగాధర్‌ పేరుతో ఇక్కడే చీమకుర్తిలో గతంలో ఉన్న తాను   బౌద్దం పట్ల ఆకర్షితుడినై కుటుంబాన్ని వదిలి శ్రీలంక వెళ్లినట్లు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షకు చందవరం బౌద్ద క్షేత్రం గురించి వివరించానని, ఈ ప్రాంతంలో 10 ఎకరాలు సేకరిస్తే 10 దేశాల సహకారంతో అభివృద్ధి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు.  

Updated Date - 2021-03-14T09:48:46+05:30 IST