జగన్‌రెడ్డి గోసంరక్షణను పట్టించుకోవడం లేదు: బుచ్చిరాం ప్రసాద్

ABN , First Publish Date - 2021-12-19T23:37:26+05:30 IST

విశాఖ వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ అన్నారు.

జగన్‌రెడ్డి గోసంరక్షణను పట్టించుకోవడం లేదు: బుచ్చిరాం ప్రసాద్

విజయవాడ: విశాఖ వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం వెంకోజీపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమంలో గోవుల మరణాలు ఆగడం లేదన్నారు. ఆశ్రమంలో దాణా, నీరు లేక ఈనెల17న 13, ఈరోజు మరో 4 గోవులు మృతి చెందడం దేవాదాయ శాఖ వైఫల్యమేనని చెప్పారు.గోవులకు ఆహారం పెట్టలేని పరిస్థితి జగన్ ప్రభుత్వానిదన్నారు.ఆశ్రమంలో వరుసగా గోవులు చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అని బుచ్చిరాం ప్రసాద్ ప్రశ్నించారు.

సీఎం జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత గోసంరక్షణను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గోవులకు దాణా, నీరు ఇవ్వలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు ఏం నిర్మిస్తారు? అని నిలదీశారు. ఆశ్రమంలోని160 గోవులకు ఆలనా పాలనా కరువైందన్నారు. దేవాదాయశాఖ పట్ల జగన్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాలు కరువయ్యాయని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల జగన్ పాలనలో దేవాలయాల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-19T23:37:26+05:30 IST