‘కోవిడ్ కేంద్రాలుగా హిందూ దేవాలయాలను తీసుకోవడం సరికాదు’

ABN , First Publish Date - 2021-05-18T17:39:59+05:30 IST

కోవిడ్ కేంద్రాలుగా హిందూ దేవాలయాలను తీసుకోవడం సరికాదని టీడీపీ నేత బుచ్చి రాంప్రసాద్ అన్నారు.

‘కోవిడ్ కేంద్రాలుగా హిందూ దేవాలయాలను తీసుకోవడం సరికాదు’

అమరావతి: కోవిడ్ కేంద్రాలుగా హిందూ దేవాలయాలను తీసుకోవడం సరికాదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరు చూస్తుంటే అర్చకులను కూడా కోవిడ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేలా... ఆదేశాలు ఇచ్చేలా ఉందన్నారు. దేవాలయాలకు బదులు పాఠశాలలు, కళాశాలలు కోవిడ్ కేంద్రాలుగా తీసుకోవచ్చు కదా అని అన్నారు. కోవిడ్ సమయంలో అర్చక కుటుంబాలను  ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చేసిందేమిటని ప్రశ్నించారు. 180కి పైగా దేవాలయాలపై దాడులు జరిగితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, కోవిడ్ కేంద్రాలుగా దేవాలయాలను తీసుకోవడం దేనికి సంకేతమని బుచ్చి రాంప్రసాద్ ప్రశ్నించారు.


Updated Date - 2021-05-18T17:39:59+05:30 IST