ఏపీ ధాన్యానికి తెలంగాణ బ్రేకులు

ABN , First Publish Date - 2021-11-26T09:48:32+05:30 IST

ఏపీ ధాన్యానికి తెలంగాణ బ్రేకులు

ఏపీ ధాన్యానికి తెలంగాణ బ్రేకులు

రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన లారీలు

అనుమతి లేదంటున్న టీఎస్‌ పోలీసులు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 25: కర్నూలు జిల్లా నుంచి ధాన్యం తీసుకెళ్తున్న  లారీలను రాష్ట్ర సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. నంద్యాల ప్రాంతంలోని రైతుల నుంచి హంస రకం ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమ్మేందుకు బుధవారం రాత్రి 20 లారీల్లో లోడు చేసి పంపారు. రాష్ట్ర సరిహద్దుల్లోని పుల్లూరు టోల్‌గేటు వద్ద తెలంగాణ పోలీసులు ఆ లారీలను నిలిపివేశారు.  తమ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం లారీలను అనుమతించడం లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ధాన్యం లారీలు టోల్‌గేటు వద్దే నిలిచిపోయాయి. ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని అనుమతించవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.

Updated Date - 2021-11-26T09:48:32+05:30 IST