గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీకి బ్రేక్
ABN , First Publish Date - 2021-02-01T08:04:20+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీని గ్రామాల్లో నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లాలకు సమాచారం పంపింది.

పట్టణాల్లో సరఫరా యథాతథం
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రేషన్ పంపిణీని గ్రామాల్లో నిలిపివేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ జిల్లాలకు సమాచారం పంపింది. అయితే పట్టణాల్లో మాత్రం యఽథావిధిగా సోమవారం నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ ఉంటుందని తెలిపింది. గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలపై వైసీపీ రంగులు, సీఎం జగన్ ఫొటో తొలగించాలని ఎస్‌ఈసీ ఇప్పటికే ఆదేశించింది. ఎస్‌ఈసీదే తుది నిర్ణయమని హైకోర్టు తేల్చిచెప్పడంతో.. గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ సరఫరాను నిలిపివేశారు.