ఈసారీ ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు?

ABN , First Publish Date - 2021-08-27T09:15:50+05:30 IST

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈసారీ ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు?

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. తర్వాత కొవిడ్‌ నెమ్మదించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 19న రథసప్తమి వేడుకలను మాడవీధుల్లోనే నిర్వహించారు. ప్రస్తుతం థర్డ్‌ వేవ్‌ ఆందోళనలతో అక్టోబరు 7 నుంచి జరగాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశంపై టీటీడీ ఉన్నతాధికారులు త్వరలోనే సమావేశమై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-08-27T09:15:50+05:30 IST