చెప్పింది చేశాం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2021-05-30T20:02:13+05:30 IST

సంక్షేమం, అభివృద్ది.. ప్రభుత్వానికి రెండు కళ్లని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

చెప్పింది చేశాం: మంత్రి బొత్స

అమరావతి: సంక్షేమం, అభివృద్ది.. ప్రభుత్వానికి రెండు కళ్లని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనపై ఆయన మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మాటను సీఎం జగన్‌ నెరవేర్చారని, చెప్పింది చేశామన్నారు. లోకేష్ ఆరోపణలన్నీ పిచ్చి మాటలని, సీఎం జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో లోకేష్ నిరూపించాలన్నారు. టీడీపీ నేతలు పనికి మాలిన చార్జిషీట్లు విడుదల చేశారన్నారు. మూడు రాజధానులు తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వం విధానమని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Updated Date - 2021-05-30T20:02:13+05:30 IST