కొత్త ప్రాజెక్టులపై 2 రాష్ట్రాలూ డీపీఆర్‌లు ఇవ్వాలి: కేంద్రం

ABN , First Publish Date - 2021-02-05T08:42:06+05:30 IST

కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సమర్పించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది.

కొత్త ప్రాజెక్టులపై 2 రాష్ట్రాలూ డీపీఆర్‌లు ఇవ్వాలి: కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి నదులపై  చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సమర్పించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్రం వెల్లడించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు డీపీఆర్‌లు సమర్పించకుండా, అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని రెండు రాష్ట్రాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని.. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబరు 10న కౌన్సిల్‌ సమావేశం జరిగిందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా తెలిపారు. గురువారం లోక్‌సభలో వైసీపీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అడిగిన వేర్వేరు ప్రశ్నలకు ఆయన  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated Date - 2021-02-05T08:42:06+05:30 IST