సీఎం నిర్ణయంతో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-06-22T09:03:29+05:30 IST

ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం వల్ల రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు తెలిపారు

సీఎం నిర్ణయంతో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ: బొప్పరాజు

అమరావతి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం వల్ల రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాల నియామకాలు జరిగాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించినట్లు ఎలా చూపిస్తారని కొందరు రాజకీయ నేతలు మీడియా ముందు ప్రస్తావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అడిగిన ఆర్టీసీ కార్మికులను... ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలెలా అడుగుతారని ప్రశ్నించిన నాయకులు నేడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందునే ఈ కరోనా కష్ట కాలంలో ఏడాదిగా ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా.. పీడీటీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఒకటో తారీఖుననే జీతాలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T09:03:29+05:30 IST