బొబ్బిలిలో టీడీపీ జోరు

ABN , First Publish Date - 2021-03-14T17:24:58+05:30 IST

బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ జోరు కొనసాగుతోంది.

బొబ్బిలిలో టీడీపీ జోరు

విజయనగరం జిల్లా: బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ జోరు కొనసాగుతోంది. 8 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ నేత, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి మున్సిపాటికిటీ సంబంధించి బాధ్యత తీసుకున్నారు. బొబ్బిలిలో ఎలాగైనా టీడీపీని ఓడించాలని మంత్రి బొత్స, మరో 8 మంది శాసనసభ్యులు బొబ్బిలో మకాం వేశారు. ఈ దశలో అన్నీ, అంతా తానై అన్నట్టు సుజయకృష్ణ రంగారావు సోదరుడు చక్రం తిప్పి.. సైకిల్ పరుగుపెట్టించారు. మున్సిపల్ స్థానాన్ని టీడీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బొబ్బిలిలో టీడీపీ జెండా ఎగురవేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Updated Date - 2021-03-14T17:24:58+05:30 IST