‘ఎటువంటి కేసులు లేని నన్ను ఓడించారు’

ABN , First Publish Date - 2021-12-28T21:57:43+05:30 IST

ప్రజా సమస్యల పై తాను 34 గంటలు అసెంబ్లీలో మాట్లాడానని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 26 గంటలు ఆనాడు మాట్లాడాడని గుర్తుచేశారు.

‘ఎటువంటి కేసులు లేని నన్ను ఓడించారు’

విజయవాడ:  ప్రజా సమస్యల పై తాను 34 గంటలు అసెంబ్లీలో మాట్లాడానని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ 26 గంటలు ఆనాడు  మాట్లాడాడని గుర్తుచేశారు. దేశంలో ఎవ్వరికీ లేనన్నికేసులు ఉన్న జగన్‌ను గెలిపించారని విమర్శించారు. ఎటువంటి కేసులు లేని తనను మాత్రం ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కూడా గుడ్డిగా నమ్మకుండా ఒక్కసారి ఆలోచన చేయండన్నారు. జగన్ పాలన రాక్షస పాలన కన్నా ఘోరంగా ఉందని మండిపడ్డారు. కావాలి జగన్..‌రావాలి జగన్ అంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు వచ్చాక శనీశ్వరుని కంటే అన్యాయంగా పాలన చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్ర లో కనిపించిన అందరకీ ముద్దులు పెట్టాడని, అది చూసి ప్రజలు ఓట్లు గుద్దితే... వారి పై గుది బండ మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అంటే జగన్ సపోర్ట్ చేశారని, అప్పుడు సాక్ష్యం కూడా తానేనన్నారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మోసం చేశాడని మండిపడ్డారు.  జగన్‌కు వాళ్లు, వీళ్లు అమే తేడా ఉండదన్నారు. డాక్టర్ సుధాకర్, వాళ్ల ఎంపి రఘురామకృష్ణ రాజును కొట్టించాడన్నారు. నలభై యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు‌ను కంట తడి పెట్టించాడని మండిపడ్డారు. Updated Date - 2021-12-28T21:57:43+05:30 IST