వాజ్‌పేయి బాటలోనే మోదీ: ఎంపీ సుజనా

ABN , First Publish Date - 2021-12-26T00:03:33+05:30 IST

మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి బాటలోనే ప్రధాని

వాజ్‌పేయి బాటలోనే మోదీ: ఎంపీ సుజనా

విశాఖ: మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పేయి బాటలోనే ప్రధాని నరేంద్ర మోదీ నడుస్తున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు.  నగరంలో జరిగిన వాజ్‌పేయి జయంతి వేడుకలలో ఆయన మాట్లాడారు. దేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మోదీ చాటి చెబుతున్నారని ఆయన కొనియాడారు. ఏపీలో జరుగుతున్న ఆటవిక, దుర్మార్గ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారన్నారు. అభివృద్ధిలో ఏపీ 20-30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్‌ ఉండదన్నారు. టికెట్ల విషయంలో థియేటర్ల యజమానులు కలిసికట్టుగా పోరాడాలని సుజనా సూచించారు. 

Updated Date - 2021-12-26T00:03:33+05:30 IST