వైసీపీ, టీడీపీ ఒకే బాటలో బడ్జెట్‌ను విమర్శిస్తున్నాయి: జీవీఎల్
ABN , First Publish Date - 2021-02-07T00:17:24+05:30 IST
వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేయడమే వైసీపీ, టీడీపీ పని అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి జయశంకర్ అధ్యక్షతన బడ్జెట్‌పై అవగాహన సదస్సు ...

విజయవాడ: వాస్తవాలు మాట్లాడకుండా రాజకీయం చేయడమే వైసీపీ, టీడీపీ పని అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. కేంద్ర మంత్రి జయశంకర్ అధ్యక్షతన బడ్జెట్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ.. వైసీపీ, టీడీపీ ఒకే బాటలో బడ్జెట్‌ను విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో కూడా టీడీపీ అలాచేసి దెబ్బతిందని, ఇప్పుడు వైసీపీ సర్కార్ కూడా చావుదెబ్బ తింటుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చెత్త రాజకీయం చేసే పార్టీలను జనాలు తరిమి కొట్టాలని జీవీఎల్ విమర్శించారు. ఈ సదస్సుకు సోము వీర్రాజు, సునీల్ ధియోదర్, జీవీఎల్ నర్సింహారావు హాజరైనారు.