వైసీపీ సర్కార్‌కు సమయం ఇచ్చాం...అయినప్పటికీ : సీఎం రమేష్

ABN , First Publish Date - 2021-12-28T19:26:27+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

వైసీపీ సర్కార్‌కు సమయం ఇచ్చాం...అయినప్పటికీ : సీఎం రమేష్

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చామని... రెండున్నరేళ్లలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ చేసిందేమీ లేదని అన్నారు. ప్రజాగ్రహ సభతో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. పేర్ని నాని, పయ్యావుల వ్యాఖ్యలు ఆ భయం నుంచి వచ్చినవే అని తెలిపారు. అన్ని అంశాలపై ప్రజాగ్రహ సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ చాలా నష్టపోయిందన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని  ఉద్యోగులు బాధపడుతున్నారని ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు.

Updated Date - 2021-12-28T19:26:27+05:30 IST