ఏపీలో ‘అంతామాకే’ అనే పాలన సాగుతోంది: Lanka dinakar

ABN , First Publish Date - 2021-12-25T19:36:14+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహర్ వాజ్‌పెయ్ స్పూర్తితో నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

ఏపీలో ‘అంతామాకే’ అనే పాలన సాగుతోంది: Lanka dinakar

అమరావతి: మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న అటల్ బిహర్ వాజ్‌పెయ్ స్పూర్తితో నేడు సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన లేదని, స్వపరిపాలన జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సుపరిపాలనలో భాగమని చెప్పుకొచ్చారు. ఏపీలో సబ్ మేర సాత్, సబ్ మేర వికాస్, సబ్ మేర విశ్వాస్ అనే ఏకవ్యక్తి నిరంకుశ పాలన జరుగుతోందని విమర్శించారు. ప్రధాని మోడీ సుపరిపాలన భాగంగా "అంత్యోదయ" అంటుంటే, ఏపీలో "అంతమాకే" అనే పాలన సాగుతోందని లంకా దినకర్ అన్నారు. 

Updated Date - 2021-12-25T19:36:14+05:30 IST