బీసీలపై బీజేపీ వివక్ష

ABN , First Publish Date - 2021-12-09T08:58:24+05:30 IST

‘‘కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బలహీనవర్గాల పట్ల వివక్షత

బీసీలపై బీజేపీ వివక్ష

కుల గణనతోనే న్యాయం: కృష్ణయ్య

ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద  భారీ ధర్నా

న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘‘కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బలహీనవర్గాల పట్ల వివక్షత చూపుతోంది. కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదు? దేశంలోని 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకురాకుండా మన దేశం అగ్ర దేశంగా తయారు కాగలదా?’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య కేం ద్రాన్ని నిలదీశారు.


జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో కుల గణన కూడ చేపట్టాలన్న డిమాండ్‌తో కృష్ణయ్య నాయకత్వంలో బుధవారం ఇక్కడ జం తర్‌ మంతర్‌ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించి ధ ర్నా చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి వందలాది మంది బీసీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ కృష్ణ య్య మాట్లాడారు. జనాభా గణనకు సంబంధించి ఫారంలో మొత్తం 35 కాలమ్స్‌ ఉన్నాయన్నారు. ఇందులో కుల గణనకు సంబంధించి మరో కాలం పెడితే ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కుల గణన జరిగినప్పుడే బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుగుతుందన్నారు. 


Updated Date - 2021-12-09T08:58:24+05:30 IST